!['ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్'](/styles/webp/s3/article_images/2017/09/4/71440096122_625x300.jpg.webp?itok=ud4GaRa9)
'ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్'
ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి టుటక్ టుటక్ టుటియా సినిమాలో నటిస్తున్న సోనూసూద్, ప్రభుదేవా కామెడీ టైమింగ్, డైరెక్షన్ టాలెంట్ పై ప్రశంసలు కురిపించాడు. ' ఇప్పటికే ప్రభుదేవాతో కలిసి రెండు సినిమాల్లో నటించా.. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు. ఆయన కామెడీ టైమింగ్, డైరెక్షన్ టాలెంట్ అద్భుతం' అన్నాడు.
ఈ సినిమాతో తొలి సారిగా నిర్మాతగా మారుతున్న సోనూసూద్ ప్రమోషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక నిర్మాతగా ప్రేక్షకుడు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇచ్చేందుకు కష్టపడ్డానని తెలియజేశాడు. తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 7న రిలీజ్ అవుతోంది.