లేడీ పోలీసాఫీసర్ | Pragya Jaiswal In Sundeep Kishan Krishnavamsi Nakshatram | Sakshi
Sakshi News home page

లేడీ పోలీసాఫీసర్

Published Wed, Aug 17 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

లేడీ పోలీసాఫీసర్

లేడీ పోలీసాఫీసర్

‘‘అందంగా.. అమాయకంగా.. కనిపిస్తుందని ఈ అమ్మాయిని తక్కువ అంచనా వేయకండి. కేడీల తాట తీసే లేడీ పోలీసాఫీసర్ ఈవిడ’’ అంటున్నారు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తేజూకి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ని ఎంపిక చేశారు. డేరింగ్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్‌గా ప్రగ్యా కనిపించనున్నారు. అతిథి పాత్రకు జోడీ అంటే తళుక్కున మెరిసే చిన్నాచితకా పాత్ర కాదట.
 
 కథలో కీలక సన్నివేశాలతో పాటు ప్రగ్యాపై రెండు ఫైట్స్ తీస్తున్నట్టు కృష్ణవంశీ తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ రెండు ఫైట్స్‌లో ఒకటి హీరో సందీప్‌తో కావడం. వీరిద్దరూ ఎందుకు ఫైట్ చేసుకున్నారో తెలియాలంటే ‘నక్షత్రం’ విడుదల వరకూ ఎదురుచూడక తప్పదు. త్వరలో ప్రగ్యా జైస్వాల్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. పేరుకు మాత్రమే ఇది ‘నక్షత్రం’.. కాస్టింగ్ పరంగా చూస్తే అందాల హరివిల్లు అనాలేమో! ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనాతో పాటు  కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే లోపు ఇంకెంత మంది ‘నక్షత్రం’లో మెరుస్తారో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement