హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు | 'Prem Ratan Dhan Payo', SRK win Ghanta awards | Sakshi
Sakshi News home page

హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు

Published Mon, May 16 2016 5:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు

హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు

ముంబై: 'దిల్ వాలే' నటనకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ ఖాన్ 2016 ఘంటా అవార్డుల్లో వరస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చెత్త సినిమాగా నిలిచింది. ఏడాది కాలంలో బాలీవుడ్ లో విడుదలైన వాటిలో చెత్తవాటికి ఘంటా అవార్డులు ఇస్తుంటారు.

సూరజ్ బరజాత్య దర్శకత్వం వహించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' అత్యధిక చెత్త అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన సోనమ్ కపూర్ చెత్త నటిగా ఎంపికైంది. టైటిల్ ట్రాక్ కూడా వరస్ట్ సాంగ్ గా నిలిచింది. సల్మాన్ సోదరుడిగా నటించిన నితిన్ ముఖేశ్ చెత్త సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నాడు.

షాహిద్ కపూర్-అలియా భట్ సినిమా 'షాందార్'ను తెరకెక్కించిన వికాస్ బహల్ చెత్త దర్శకుడిగా ఎంపికయ్యాడు. సూరజ్ పంచోలి కొత్తగా పరిచయమైన చెత్త నటుడిగా నిలిచాడు. 'బాంబే వెల్వెట్' లో కరణ్ జోహార్ విలన్ గా నటించడాన్ని వరస్ట్ మిస్ కాస్టింగ్ గా తేల్చారు. 'అలోన్' డ్యుయల్ రోల్ చేసిన బిపాసా బసు వరస్ట్ కఫుల్ అవార్డు దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement