'కోటి' సాధించిన ప్రియాంక
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ట్వీటర్‌లో ఆమె కోటి మంది ఫాలోవర్లను సాధించారు. ఈ ఘనత సాధించడంపై ప్రియాంక తన సంతోషం వెలిబుచ్చారు. పది మిలియన్ల ఫాలోవర్లను సాధించినందుకు తానెంతో అదృష్టవంతురాలినని, దీనికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె ఆదివారం ట్వీటర్‌లో ప్రకటించారు. 2000లో మిస్ వరల్డ్‌గా ఎంపికైన ప్రియాంక, అనంతరం ఫ్యాషన్, కమీనే, ఐత్‌రాజ్, మేరీకోమ్ వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో ప్రారంభమవనున్న ప్రఖ్యాత అమెరికా టీవీ షో ‘క్వాంటికో’లో ఆమె ప్రధాన పాత్ర పోషించనుంది.