పిల్లల కోసమే నాకు మగాడు! | Priyanka Chopra: I don't need a man except for children | Sakshi
Sakshi News home page

పిల్లల కోసమే నాకు మగాడు!

Published Fri, Jan 29 2016 11:55 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

పిల్లల కోసమే నాకు మగాడు! - Sakshi

పిల్లల కోసమే నాకు మగాడు!

సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడడం ప్రియాంకా చోప్రా స్టైల్. మనసులో ఏది అనిపిస్తే అది నిర్భయంగా చెప్పేస్తారు. ఎదుటి వ్యక్తులు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించరు. అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోల్డ్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌లో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ‘‘నా జీవితానికి మగాడు కావాలనిపిస్తే... అది కేవలం పిల్లల కోసమే తప్ప నేను అతడి నుంచి వేరే ఏమీ కోరుకోను’’ అని ప్రియాంక ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘స్వశక్తితో పైకొచ్చిన నేను డబ్బు కోసమో, ఖరీదుగల బహుమతుల కోసమో బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టైన్ చేయాలనుకోను. ఇల్లు, కారు, ఖరీదు గల వజ్రాలు కొనుక్కునే సత్తా నాకుంది.

వాటి కోసం నా జీవితంలోకి మగాణ్ణి తెచ్చుకోను. ప్రేమించి, మోసం చేసే అబ్బాయిని ఊరకే వదలి పెట్టను. చెంపలు వాయించి మరీ అతణ్ణి వదిలించుకుంటాను. ప్రేమలో నిజాయతీ ఉండాలి. ఒకవేళ ఎవరితో అయినా ప్రేమలో పడితే, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సెలబ్రిటీ అయినంత మాత్రాన వ్యక్తిగత జీవితం గురించి నలుగురికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ప్రియాంక చెప్పారు. వామ్మో... మొత్తానికి ప్రియాంక చాలా బోల్డే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement