6 హాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది | Priyanka Chopra said no to 6 Hollywood films and chose this as her next project | Sakshi
Sakshi News home page

6 హాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది

Published Tue, Aug 9 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

6 హాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది

6 హాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది

బాలీవుడ్ బిజీ స్టార్ ప్రియాంక చోప్రా.. ఇటీవల ఆరు హాలీవుడ్ సినిమాలకు నో చెప్పిందట. ఓ వైపు  క్వాంటికో సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా, మరోవైపు హాలీవుడ్లో తన తొలి చిత్రం 'బేవాచ్' ప్రమోషన్కు ప్రిపేర్ అవుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో బోలెడన్ని స్క్రిప్టులు కూడా విన్న పిగ్గీ చాప్స్.. 6 హాలీవుడ్ సినిమాకు నో చెప్పేసింది. తాజాగా ఆమె ఇంటర్నేషనల్ ప్రాజెక్టు 'ప్రాజెక్టు రన్ వే'లో మెరవనుంది. అమెరికన్ టెలివిజన్కి చెందిన ఫ్యాషన్ రియాలిటీ షోలో ఆమె సెలబ్రిటీ గెస్ట్గా అలరించనుంది. సెప్టెంబరు 15 నుంచి ప్రసారం కానున్న ప్రాజెక్టు రన్ వే సీజన్15లో ప్రియాంక పాల్గొననుంది. క్వాంటికో తరువాత ఆమె చేస్తున్న మరో టెలివిజన్ సిరీస్ ఇది.

గత నెలలో ఆమె సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జొహార్, జోయా, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖ దర్శకనిర్మాతలను కలుసుకున్నప్పటికీ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదే విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఓకే చెప్పలేదు. 6 సినిమాలను వదులుకున్నాను. ఇక నుంచి బెస్ట్ అనుకున్న సినిమాలకే ఓకే చెప్తాను. వచ్చే ఏడాది నుంచి ఇటు బాలీవుడ్లో, అటు హాలీవుడ్లో  ఒక్కో సినిమానే చేయాలని అనుకుంటున్నాను. అది కూడా నాకు సమయం దొరికితేనే. నేను 70ఎంఎం గాళ్..ఏదేమైనా హిందీ సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదు. నేను నటిస్తున్న టీవీ సిరీస్ను కూడా 70 ఎంఎంలోనే చూస్తానంటూ సెలవిచ్చింది. తను కేవలం నటి మాత్రమే కాదని, ఆర్టిస్ట్నని.. ఎప్పుడూ ఒకే తరహాలో నటించలేనని, వెరైటీని ప్రేమిస్తానని తెలిపింది. క్రియేటివ్ ప్రస్ట్రేషన్కి గురవుతున్నానని.. ప్రస్తుతం ఒక సమయంలో ఒక సినిమాలోనే  నటించాలని నిర్ణయించుకున్నానని వివరించింది ప్రియాంక చోప్రా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement