ఆ సినిమాలో నాలుగు సీన్లు కట్‌ | Producers Of Akshay Kumar's 'Jolly LLB 2' Give Up Fight, Will Drop 4 Scenes | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో నాలుగు సీన్లు కట్‌

Published Tue, Feb 7 2017 2:27 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

ఆ సినిమాలో నాలుగు సీన్లు కట్‌

ఆ సినిమాలో నాలుగు సీన్లు కట్‌

అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి–2’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. షెడ్యూల్‌ ప్రకారమే ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ సినిమా విడుదలకు సెన్సార​బోర్డు పచ్చజెండా ఊపిందని నిర్మాతలు తెలిపారు. అభ్యంతకరంగా ఉన్న నాలుగు సీన్లను తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని భావించిన   నిర్మాతలు తర్వాత మనసు మార్చుకున్నారు. హైకోర్టు చెప్పిన విధంగా నాలుగు సీన్లు కట్‌ చేసి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడంతో వివాదానికి తెర పడింది.

న్యాయవాదులను కించేపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని లాయర్‌ అజయ్‌ కుమార్‌ వాగ్‌ మారే కోర్టులో కేసు వేయడంతో వివాదం మొదలైంది. ‘జాలీ ఎల్‌ఎల్‌బి–2’వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన కామెడీ మూవీ. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ సరసన హ్యూమా ఖురేషి నటించింది. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ తరహాలో ఈ సీక్వెల్‌ కూడా మంచి హిట్టవుతుందని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement