అందుకే ఆయన దేవుడయ్యారు! | Puttaparthi Sai Baba's life story by film | Sakshi
Sakshi News home page

అందుకే ఆయన దేవుడయ్యారు!

Published Wed, Feb 22 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

అందుకే ఆయన దేవుడయ్యారు!

అందుకే ఆయన దేవుడయ్యారు!

పుట్టపర్తి సాయిబాబా జీవిత కథతో రూపొందుతున్న సినిమా ‘శ్రీ సత్యసాయి బాబా’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కరాటం రాంబాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ప్రశాంతి నిలయం సెట్‌లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. వచ్చే నెల 10తో ఈ షెడ్యూల్‌ ముగుస్తుందని నిర్మాత తెలిపారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘మనలో ఒకరిగా, మనతోనే తిరుగుతూ సమజానికి ఏ విధంగా మంచి చేయొచ్చని ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా.

అందుకే, ఆయన దేవుడు అయ్యారు. భక్తుల కోసమే కాదు.. భక్తులు కానివాళ్లకూ ఈ కథ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సత్యసాయిగా మలయాళ నటుడు శ్రీజిత్‌ విజయ్, తల్లిదండ్రులుగా జయప్రద, శరత్‌బాబు నటిస్తున్నారు. సినిమాలో 14 పాటలనూ జొన్నవిత్తుల రాశారు. ఇళయరాజాగారు అద్భుతమైన స్వరాలు ఇచ్చారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణగారు చివరి పాట పాడిన చిత్రమిదే. ఆ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు కరాటం రాంబాబు. కెమేరా: వాసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement