పార్లమెంట్లో సినీ వేడుక | Raagdesh Trailer will be launched in Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్లో సినీ వేడుక

Published Sat, Jun 24 2017 1:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

పార్లమెంట్లో సినీ వేడుక

పార్లమెంట్లో సినీ వేడుక

ఎప్పుడు రాజకీయాలతో దద్దరిల్లే పార్టమెంట్ భవనం త్వరలో సినీ వేడుకకు ఆతిథ్యమివ్వనుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ఫంక్షన్ పార్లమెంట్ భవనంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా డైరెక్షన్లో తెరకెక్కిన రాగ్ దేశ్ సినిమా ట్రైలర్ను మన పార్లమెంట్ భవనంలో విడుదల చేసేందుకు అనుమతి లభించింది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు తిగ్మాంషు ధులియా స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ను త్వరలో పార్లమెంట్ వేదిక.. పలువురు సినీ రాజకీయ ప్రముఖల సమక్షంలో నిర్వహించనున్నారు. జూలై 28 ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement