
రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వినయ విధేయ రామ. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ పోస్టర్‌లతో పాటు లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్లో హల్‌చల్ చేస్తోంది. త్వరలో జరగనున్న వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్, రాజమౌళిలు హాజరుకానున్నారట. ఆర్‌ఆర్‌ఆర్, వినయ విదేయ చిత్రాలకు నిర్మాత ఒకరే కావటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. గతంలోనూ ఎన్టీఆర్ భరత్ అనే నేను వేడుకలో మహేష్ బాబుతో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment