సాక్షి చెన్నై: సినిమానే కాదు ఏ రంగంలోనైనా సక్సెసే కొలమానం అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపజయాలతో నెట్టుకు రావడం కష్టమే. ఇకపోతే నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కోలీవుడ్ అచ్చిరానట్టుంది. ఎందుకంటే మొదట ఈ అమ్మడు ఇక్కడనే నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. పుత్తకం, ఎన్నమో ఏదో, తడయారతాక్క లాంటి చిత్రాలు చేసినా కోలీవుడ్ వర్గాలు పట్టించుకోలేదు. కారణం ఆ చిత్రాలు ప్రేక్షకాదరణను నోచుకోకపోవడం బలమైన కారణం కావచ్చు. అయితే టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని కాలం కలిసి రావడంతో అనూహ్యంగా విజయాలు తద్వారా అవకాశాలు రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అదే ఊపుతో కోలీవుడ్‌లో పాగా వేయాలని ఆశిస్తున్న రకుల్‌కు రీఎంట్రీలోనే స్పైడర్ దెబ్బ కొట్టింది. స్పైడర్ చిత్రం దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌నే కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చారని, ఇళయదళపతితో డ్యూయెట్లు పాడే అవకాశాన్నిచ్చారనే ప్రచారం ఈ మధ్య వైరల్ అయ్యింది.
తాజా పరిణామాలు ఆ దర్శకుడి నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయా? ఈ విషయం గురించి స్పష్టమైన సమాచారం లేదు గానీ, తాజాగా మెర్శల్‌తో కలకలాన్ని, అరమ్‌తో సంచలనాన్ని కలిగిస్తున్న స్టార్ నటుడు విజయ్, లేడీసూపర్‌స్టార్‌గా మంచి క్రేజ్‌లో ఉన్న నటి నయనతార జత కట్టనున్నారనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది. విజయ్ 62వ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఇందులోనే నయనతార నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇందులో నిజం ఎంత?మరి రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ చిత్రంలో ఉన్నట్టా? హ్యండ్ ఇచ్చినట్టా? లేక ఈ అమ్మడి అవకాశాన్ని నయనతార తన్నుకుపోయిందా? లేక ఇద్దరు ముద్దుగుమ్మలు చిత్రంలో ఉంటారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
కాగా విజయ్‌తో ఆయన 62 చిత్రంలో నయనతార నటించడం నిజమే అయితే ఇది ఆయనతో నటిస్తున్న మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు శివకాశి చిత్రంలో విజయ్‌తో కలిసి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన నయనతార 2009లో వచ్చిన విల్లు చిత్రంలో కథానాయకిగా నటించింది. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత విజయ్‌తో కలిసి నటించనుందన్న మాట. అదే విధంగా నటి రకుల్ ప్రీత్‌సింగ్ కోలీవుడ్ భవిష్యత్ శుక్రవారం విడుదల కానున్న కార్తీతో నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment