ఆమెక్కడ.. నేనెక్కడ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. కోలీవుడ్‌లో విజయం కోసం చాలాకాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఈ అమ్మడికి ఇటీవలే 'ధీరన్ అధికారం ఒండ్రు' (తెలుగులో ఖాకి) చిత్రంతో హిట్ సొంతమైంది. మొదట్లో కోలీవుడ్‌లో రాణించకపోవడంతో నిరాశపడిన రకుల్ టాలీవుడ్‌కు తరలివచ్చింది. అదృష్టం కలిసొచ్చి ఇక్కడ సక్సెస్ అయింది. అయితే మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుతో నటించిన 'స్పైడర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీతో రొమాన్స్ చేసిన ‘ధీరన్ అధికారం ఒండ్రు’ రకుల్ కెరీర్‌కు కీలకంగా మారింది. టాలీవుడ్‌లోనూ ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు లేవు. తమిళంలో విజయ్‌కు జంటగా నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా అందులో స్పష్టత లేదు. ఇక సూర్య సరసన సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్నా అది ఎప్పుడు సెట్‌పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి.
ఇలాంటి సమయంలో 'ధీరన్ అధికారం ఒండ్రు' చిత్ర విజయం రకుల్‌కు నూతనోత్సాహానిచ్చింది. దీంతో తదుపరి నయనతార నువ్వేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'వామ్మో ఆమె ఎక్కడ, నేనెక్కడ.. నయనతారతో నన్ను పోల్చకండి' అని టక్కున బదులిచ్చింది. నయనతార మంచి కథాచిత్రాల్లో నటిస్తూ ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారని, తాను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటినని పేర్కొంది. నటిగా ఇంకా చాలాదూరం పయనించాలని, తాను కూడా నయనతార తరహాలో నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment