ఆరడుగుల మగాడి కోసం ఎదురు చూస్తున్నా..  | rakul preet singh talk about her marriage | Sakshi
Sakshi News home page

ఆరడుగుల మగాడి కోసం ఎదురు చూస్తున్నా.. 

Published Sat, Feb 10 2018 8:22 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

rakul preet singh talk about her marriage - Sakshi

రకుల్‌ప్రీత్‌సింగ్

తమిళసినిమా : నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఆరడుగుల మగాడి కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది‌. ఈ అమ్మడూ వరుడి వేటలో పడినట్లుంది. కోరుకున్న వాడితోనే తన పెళ్లి ఉంటుందని ఇది వరకే ఒక భేటీలో పేర్కొన్న రకుల్‌ తన నిర్ణయాన్ని అమలుపరచే పనిలో పడినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో విజయం కోసం తపించి ఎట్టకేలకు ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంతో దాన్ని దక్కించుకుంది. మొదట్లో వర్ధమాన హీరోలతో నటించిన రకుల్‌ విజయాల బాట పట్టిన తరువాత స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యకు జంటగా ఆయన 36వ చిత్రంలో నటిస్తోంది. తదుపరి ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం తరువాత మరోసారి కార్తీతో జత కట్టడానికి రెడీ అవుతోంది.  

హిందీలో నటించిన అయ్యారే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అక్కడే అజయ్‌దేవ్‌గన్‌తో మరో చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇక తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే బాలీవుడ్‌కు వెళ్లిన తరువాత రకుల్‌ప్రీత్‌సింగ్‌ గ్లామర్‌ విషయంలో మరీ హద్దులు చెరిపేయడానికి సిద్ధమైందనే ప్రచారం జరగుతోంది.

ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన అర్ధనగ్న ఫొటోలు చూసిన వారు రకుల్‌ ఇలా తయారయ్యిందేమిటని గుసగుసలాడుతున్నారు. ఒక భేటీలో ఎలాంటి భర్తను కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఈ జాణ ఏం చెప్పిందంటే, తాను మల్టీ మిలినియర్‌ కావాలని, విదేశాలకు చెందిన వాడు కావాలని కోరుకోవడం లేదన్నారు. తన హైట్‌ 5.9 అడుగులని, అందుకే కనీసం ఆరడుగుల మగాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. అంతే కాదు అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. మరి అతగాడెవడై ఉంటాడో, ఎక్కడున్నాడో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement