కథకు ప్రాధాన్యం ఉండే చిత్రాలను ఎంచుకుంటూ.. ఎంచుకునే పాత్రలకు న్యాయం చేసే నటుడు శర్వానంద్. అతని కెరీర్‌లో ఎన్నో విభిన్న చిత్రాలు ఉన్నాయి. చివరగా పడి పడి లేచే మనసు చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ రణరంగం చిత్రంతో తన అదృష్టాన్ని పలకరించేందుకు రెడీ అయ్యాడు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేవిదంగా ఉంది. ట్రైలర్‌కు తోడుగా ఈ చిత్రంలోంచి స్పెషల్ సౌండ్ ట్రాక్‌ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌ను మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేస్తూ.. ‘సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది.టెర్రిఫిక్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. మళ్ళీ శర్వానంద్ ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలావుంది. పర్ఫెక్ట్ గా ఉంది. శర్వా లో ఉన్నది, మాకు నచ్చింది. అతనిలో ఉన్న ఇంటెన్సిటీ. అతని చిత్రాల్లో కో అంటే కోటి చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత అలాంటి చిత్రం అనిపించింది. దర్శకుడు సుధీరవర్మ ఈ చిత్రం తో తన ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నారనిపించింది. చాలా మంచి ప్లాట్ ఉన్న చిత్రం. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటం తో పాటు కొత్తగా ఉంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాల’ని అన్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment