దాసరితో వర్మ భేటీ | ram gopal varma met dasari narayanaro today | Sakshi
Sakshi News home page

దాసరితో వర్మ భేటీ

Published Fri, Jan 8 2016 7:13 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

ram gopal varma met dasari narayanaro today

హైదరాబాద్: ఇద్దరు దిగ్గజ దర్శకుల అరుదైన కలయికకు కారణం అయ్యాడు దివంగత గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. ఆ దర్శకుల్లో ఒకరు 'దర్శకరత్న' దాసరి కాగా, మరొకరు రామ్ గోపాల్ వర్మ. స్మగ్లర్ మరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని వర్మ రూపొందించిన 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా తెలుగు వెర్షన్ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో  'కిల్లింగ్ వీరప్పన్' సినిమాను చూశానని, శుక్రవారం ఆ సినిమా దర్శకుడు రాం గోపాల్ వర్మ తన ఇంటికి వచ్చారని దాసరి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. అయితే ఈ భేటీలో ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా, ఈ కలయిక సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement