
'చిరంజీవి 150వ సినిమాకు పూరియే డైరెక్టర్'
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథే డైరెక్టర్ అని హీరో రామ్ చరణ్ తెలిపారు. సినిమా సెకండాఫ్ కథ చర్చల్లో ఉందని వెల్లడించారు. పూరి జగన్నాథ్ ను మారుస్తున్నారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. తన తండ్రి నటించబోయే సినిమాకు పూరియే దర్శకుడని స్పష్టం చేశారు. 'గబ్బర్ సింగ్ 2' తర్వాత బాబాయ్ పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తానని ప్రకటించారు.
కాగా చిరంజీవి 150 సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు పూరి జగన్నాథ్ ఇంతకుముందు ప్రకటించారు. ఆయనకు ఫస్టాప్ కథ వినిపించానని చెప్పారు. సెకండాఫ్ కథపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనికి 'ఆటో జానీ' టైటిల్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి పూరి జగన్నాథ్ ను తప్పించారన్న రూమర్లు కొద్ది రోజులుగా షికారు చేయడంతో రామ్ చరణ్ వివరణ ఇచ్చారు.