రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు | Rangoon is a box-office disaster despite good reviews | Sakshi
Sakshi News home page

రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు

Published Thu, Mar 2 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు

రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు

ముంబై: విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్‌, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ నటించిన బాలీవుడ్ సినిమా రంగూన్‌కు రివ్యూలు పాజిటివ్‌గా వచ్చినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాకు ఆశించిన, ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

ఈ నెల 24న రంగూన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకూ 30 కోట్ల రూపాయలు కూడా వసూలు కాలేదు. అభిమానులు, నెటిజెన్లు, సినీ విమర్శకులు ఈ సినిమాను ప్రశంసించినా ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోయేసరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఢీలాపడ్డారు. దీనికితోడు ఈ సినిమా పైరసీ బారిన పడటం కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని భావిస్తున్నారు. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement