రంగూన్‌ సెలబ్రిటీ ‘రివ్యూ’ | Stars Watch Kangana Ranaut, Shahid Kapoor's Film. ‘wow’ They Tweet | Sakshi
Sakshi News home page

రంగూన్‌ సెలబ్రిటీ ‘రివ్యూ’

Published Fri, Feb 24 2017 12:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

రంగూన్‌ సెలబ్రిటీ ‘రివ్యూ’

రంగూన్‌ సెలబ్రిటీ ‘రివ్యూ’

ముంబయి: షూటింగ్‌ ప్రారంభంనాటి నుంచే అంచనాలు పెంచిన సినిమా రంగూన్‌. దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ మరో మాస్టర్‌పీస్‌తో రావడం ఖాయం అని కొబ్బరికాయ కొట్టిన రోజే బాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పాయి. దానికి తగినట్లుగానే చిత్ర ట్రైలర్లు, ప్రచార చిత్రాలు, పాటలు, యాక్షన్‌ సీన్లు, లవ్‌ సీన్లు సోహల్‌ మీడియాను ఒక ఊపుఊపాయి. ముఖ్యంగా చిత్ర నటులు కంగనా రనౌత్‌, షాహీద్‌ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ జోడీపై లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి.

యుద్ధ నేపథ్యంతోపాటు మంచి లవ్‌ స్టోరీ కూడా ఇందులో ఉండటంతో సినిమాపై భారీ అంచానలు ఏర్పడ్డాయి. దీనికి తగట్టుగానే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నిరాజనాలందుకుంటోంది. సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించగా సినిమా చూసిన వారంతా ఫుల్‌ జోష్‌తో కనిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇది నిజంగా విశాల్‌ భరద్వాజ్‌ నుంచి వచ్చిన ఒక మాస్టర్‌ పీస్‌ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ట్వీట్లలో ప్రశంసలు కురిపించారు. సైఫ్ నటుడిగా పునర్జన్మ పొందాడని, ఈ చిత్రం విశాల్ భరద్వాజ్ కెరీర్‌లో మరో మాస్టర్ పీస్ అంటూ పొగిడారు.
 
విశాల్‌ భరద్వాజ్‌ సార్‌ మరో​ మాస్టర్‌పీస్‌. మేజికల్‌ సినిమాటోగ్రఫీ. పవర్‌ప్యాక్‌డ్‌ పర్ఫామెన్స్‌.. కంగనా, సైఫ్‌ అలీఖాన్ల నటన చాలా గొప్పగా ఉంది.
...సునీల్‌ శెట్టీ
 
‘బ్లడీ హెల్‌’(రంగూన్‌ చిత్రంలోని ఓ పాట)తోనే ఈ రోజు నిద్ర లేచాను. జులియా-నవాబ్‌ మాలిక్‌లను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాను. షాహిద్‌ కపూర్‌ను కూడా.. కంగనా ఐలవ్‌ యూ
...నటి కృతిసనన్‌

ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరులో ఒక అద్భుత తపన కనిపించింది. పాత్రల చిత్రీకరణలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ తపన దర్శనమిస్తుంది. విశాల్ భరద్వాజ్ ముద్ర కనిపిస్తుంది. జూలియా పాత్రలో కంగన ఆకట్టుకొన్నది. షాహీద్‌ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీ ప్రేమలో పడకుండా ఎవరూ ఉండరు సైఫ్‌గారు..
...దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్

ఈ చిత్రాన్ని ద్వారా నేను సాహిత్యలోకంలో ప్రయాణించాను. ఆ కాలానికి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయం సాధించాడు. రంగూన్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది.
...రణదీప్ హుడా
 
కంగన రనౌత్ నటన, ప్రతిభ మరో స్థాయికి చేరింది. షాహీద్ కపూర్ మరోసారి వెండితెరపై మెరిశాడు. సైఫ్ అలీఖాన్ నటన అమోఘం. విశాల్ భరద్వాజ్ పనితీరు అద్భుతం
... రచయిత ప్రసూన్ జోషి
 
ఈ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్ర అవార్డుకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత అద్భుతంగా ఉంది. సైఫ్‌ నటన సూపర్‌
... సైఫ్‌ భార్య కరీనా కపూర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement