ఛలో సినిమాతో తెలగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికా మందన్నా.. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. తనదైన క్యూట్‌నెస్‌తో పెద్ద సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. నేడు(ఏప్రిల్ 5) రష్మికా బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు సినీ ప్రముఖలతో పాటు, పెద్ద సంఖ్యలో అభిమానులు తమదైన శైలిలో విషెస్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రష్మిక స్కెచ్‌లు, చిన్నప్పటి ఫొటోలు, పలు చిత్రాల్లోని స్టిల్స్, ఫన్నీ ఇంటర్వ్యూలను షేర్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #HappyBirthdayRashmika హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ప్రస్తుతం ఆమె సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment