ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్‌ | Rashmika Mandanna Manager Clarifies Over IT Raids | Sakshi
Sakshi News home page

ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్‌

Published Thu, Jan 16 2020 3:53 PM | Last Updated on Thu, Jan 16 2020 7:50 PM

Rashmika Mandanna Manager Clarifies Over IT Raids - Sakshi

హీరోయిన్‌ రష్మికా మందన్న ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఖండించిన ఆయన.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రష్మిక ప్రతి అకౌంట్‌, లావాదేవీలు  హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రష్మిక తండ్రి మదన్‌ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు. 

కాగా, కర్ణాటక కూర్గ్‌లోని రష్మిక నివాసంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీలుస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే రష్మిక మేనేజర్‌ మాత్రం.. రష్మికకు సంబంధించిన వ్యవహారాలపై ఐటీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని చెప్పారు. కాగా, మహేశ్‌ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన రష్మిక.. చేతిలో మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో నితిన్‌తో కలిసి భీష్మ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో రష్మిక నటించనున్నారు. 

చదవండి : సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement