
‘గీత గోవిందం’ సినిమాతో విజయ్‌దేవరకొండ, రష్మిక మందాన యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆ చిత్రంలో గీత పాత్రలో రష్మిక విజయ్‌ను ఏడిపించగా.. బాక్సాఫీస్ షేక్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డియర్ కామ్రేడ్’ రాబోతోన్న సంగతి తెలిసిందే.
కాలేజ్ బ్యాగ్రౌండ్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. క్రికెటర్‌గా రష్మిక నటించనుంది. మరి గీతగా విజయ్‌ను ఆటపట్టించిన రష్మిక.. లిల్లీగా డియర్ కామ్రేడ్‌లో ఏం చేయనుందో. ఇప్పటికే విడుదల చేసిన టీజర్.. మూవీపై హైప్‌ను క్రియేట్‌చేసింది. నేడు రష్మిక పుట్టిన రోజు కానుకగా.. ఈ మూవీ కొత్తపోస్టర్‌ను విడుదల చేసిందీ చిత్రయూనిట్. సోషల్ మీడియాలో రష్మికకు అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ తన స్టైల్లో రష్మికకు విషెస్ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం 11గంటల 11నిమిషాలకి ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Dear Lilly,
— Vijay Deverakonda (@TheDeverakonda) 5 April 2019
We were just kidding, don't be upset with us. You are the joy of our set, you make us tear up with your performance and smile through the day.
This 8th at 11.11 AM, we dedicate the First Song to you, this is how you make us all feel. #HappyBirthdayDearLilly pic.twitter.com/zF13DJeQrT
Comments
Please login to add a commentAdd a comment