రవితేజ పవర్ అది! | ravi teja new flick is power | Sakshi
Sakshi News home page

రవితేజ పవర్ అది!

Jan 31 2014 11:41 PM | Updated on Sep 2 2017 3:13 AM

రవితేజ పవర్ అది!

రవితేజ పవర్ అది!

మాస్ మహరాజా’ అనే బిరుదుకు తగ్గట్టుగానే.. రవితేజకు రానురాను మాస్‌లో క్రేజ్ పెరిగిపోతోంది. ఇటీవలే విడుదల చేసిన ‘పవర్’ సినిమా టీజర్‌కి వచ్చిన వ్యూసే అందుకు నిదర్శనం

 ‘మాస్ మహరాజా’ అనే బిరుదుకు తగ్గట్టుగానే.. రవితేజకు రానురాను మాస్‌లో క్రేజ్ పెరిగిపోతోంది. ఇటీవలే విడుదల చేసిన ‘పవర్’ సినిమా టీజర్‌కి వచ్చిన వ్యూసే అందుకు నిదర్శనం. ‘బలుపు’ చిత్రం టీజర్‌ని ఏడాదిలో 2 లక్షల 41 వేల మంది చూస్తే... ‘పవర్’ టీజర్‌ని యూ ట్యూబ్‌లో కేవలం వారంలో ఏడు లక్షల మంది చూడడం ఓ రికార్డ్. దీన్ని బట్టి మాస్‌లో రవితేజ ‘పవర్’ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. స్క్రిప్ట్ వర్క్‌కే ఎక్కువ సమయాన్ని వెచ్చించి, షూటింగ్‌ని మాత్రం చకచకా లాగించేస్తున్నారాయన.
 
 రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని విభిన్న ప్రాంతాల్లో జరుగుతోంది. ఫిబ్రవరి 14 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందని, కొంత టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందని దర్శకుడు చెప్పారు. కోల్‌కతాలో నెలరోజులు పాటు జరిగే భారీ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని  ఈ సందర్భంగా ఆయన తెలిపారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, ముఖేష్‌రుషి, ‘మిర్చి’ సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, కథనం: కె.చక్రవర్తి, మోహన్‌కృష్ణ, కెమెరా: ఆర్ధర్ కె.విల్సన్, సంగీతం: తమన్, కళ: బ్రహ్మకడలి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement