ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి కన్నుమూత
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి కన్నుమూత
Published Mon, Apr 7 2014 5:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బెంగళూరు: ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వీకే మూర్తి కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. 1923లో మైసూర్ లో జన్మించారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీకే మూర్తికి ఛాయా మూర్తి అనే కూతురు ఉంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు గురుదత్ ఊహలకు దృశ్యరూపం కల్పించని వ్యక్తి పేర్కొనే వీకే మూర్తి ప్యాసా, సాహిబ్, బీబీ, ఔర్ గులామ్, కాగజ్ కే పూల్ చిత్రాలకు పని చేశారు. ఇంకా ఆర్ పార్, పాకీజా, రజియా సుల్తానా లాంటి చిత్రాలకు తన సినిమాటోగ్రఫితో అదనపు ఆకర్షణగా నిలిచారు.
వీకే మూర్తి చిత్రీకరించిన 'చౌదవీన్ కా చాంద్' పాట ఇప్పటికి హిందీ సినిమా చిరిత్రలో గొప్పపాటగా నిలిచిపోయింది. సాహిబ్, బీబీ, ఔర్ గులామ్, కాగజ్ కే పూల్ చిత్రాలకు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. భారతీయ టెక్నిషియన్లలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మొట్టమొదటిగా వీకే మూర్తి రికార్డుల్లోకెక్కారు. హువా హన్ను అనే కన్నడ చిత్రంతో కెరీర్ ఆరంభించారు. విద్యార్ధి జీవితంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆయన 1943లో ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు.
Advertisement
Advertisement