వర్మకు షాకిచ్చిన వీరప్పన్ | rgv killing veerpan vs arjun veerapan | Sakshi
Sakshi News home page

వర్మకు షాకిచ్చిన వీరప్పన్

Published Sat, Dec 26 2015 3:02 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

వర్మకు షాకిచ్చిన వీరప్పన్ - Sakshi

వర్మకు షాకిచ్చిన వీరప్పన్

వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎలా చనిపోయాడు అన్న అంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్కు గురైన కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడు హీరోగా నటించటంతో కిల్లింగ్ వీరప్పన్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు.

రామ్గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ అవుతున్నాడు. 2013లో యాక్షన్ స్టార్ అర్జున్, కిశోర్ ప్రధాన పాత్రల్లో వనయుద్ధం పేరుతో వీరప్పన్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సినిమాను వీరప్పన్ పేరుతో జనవరి 1న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రామ్గోపాల్ వర్మ చేస్తున్న ప్రచారం తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు వీరప్పన్ నిర్మాతలు. మరి ఈ ఇద్దరు వీరప్పన్లలో తెలుగు ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement