గూగ్లీకి పడిపోయా | Rocking Star Yashs American Fan speaks about Yash | Sakshi
Sakshi News home page

గూగ్లీకి పడిపోయా

Published Sat, Nov 25 2017 7:58 AM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

 Rocking Star Yashs American Fan speaks about Yash - Sakshi - Sakshi

బొమ్మనహళ్లి: వెండితెరపై చూపే మంచి నటన ప్రేక్షకులను మైమరపిస్తుంది. అభిమానులనూ చేసేస్తుంది. ఆ నటన అలా ఎల్లలు దాటిన అభిమానుల్ని సంపాదించుకోవడం వింతేమీ కాదు. తక్కువ సినిమాల్లో నటించినా మంచి సినిమాల్లో నటించి తన నటన ద్వారా కర్ణాటకలో ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకున్న నటుల్లో ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ యశ్‌ ముందున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఇష్టంగా పాల్గొంటాడు. అలాంటి యశ్‌కు కన్నడనాటే కాదు అమెరికాలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. లీ ఎం. సెంట్రాచియో అనే మహిళ నటుడు యశ్‌కు వీరాభిమాని. తాను ఎందుకు నటుడు యశ్‌కు వీరాభిమానిగా మారాననేది ఒక వీడియోలో చెబుతూ దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

భారతీయ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా యశ్‌ నటించిన సినిమాలను చూసిన తాను ఆయన నటనకు ఆరాధకురాలిని అయిపోయానని చెప్పారు. ఆయన హీరోగా నటించిన గూగ్లీ సినిమాలో ఉన్న యశ్‌ నటన, డైలాగులు, పాటలు చాలా నచ్చాయని, దాంతోనే రాకింగ్‌స్టార్‌ యశ్‌కు వీరాభిమానిగా మారినట్లు చెప్పారు. తాను గత మూడు సంవత్సరాల నుంచి భారతీయ సినిమాలను చూస్తున్నానని, ఇందుకోసం హిందీ భాషను సైతం నేర్చుకుంటున్నానని, హిందీలోకి అనువదించిన గూగ్లీ సినిమాను చూశానని తెలిపారు. తాను యశ్‌ గురించి అధ్యయనం చేసేటప్పుడు కొందరు స్నేహితులయ్యారని, వారి ద్వారా యశ్‌ సినిమాల సీడీలను తెప్పించుకున్నట్లు చెప్పారు. అమెరికాలో కూడా యశ్‌ కన్నడ సినిమాలను విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం యశ్‌ నటించిన కేజీఎఫ్‌ కన్నడ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, అది రిలీజ్‌ కాగానే తప్పకుండా చూస్తానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement