ఇప్పట్లో ఎవరుంటారు? | Romantic comedy thriller | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో ఎవరుంటారు?

Published Tue, Feb 2 2016 1:40 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

ఇప్పట్లో ఎవరుంటారు? - Sakshi

ఇప్పట్లో ఎవరుంటారు?

‘‘రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఓ హత్య మిస్టరీ ఉంటుంది’’ అని దర్శకుడు కె.వెంకటేష్ అన్నారు. ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత ప్రధాన పాత్రల్లో బేబీ అముక్త సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశ్నాథ్ నిర్మించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ’. రమేష్.డి అందించిన ఈ చిత్రం పాటలను నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు మా నియోజకవర్గానికి చెందినవారే.

ఈ చిత్రం సూపర్ హిట్టయి వారిద్దరూ మంచి స్థాయికి ఎదగాలి’’ అన్నారు. ‘‘వెంకటేష్ నాకు పదేళ్లుగా తెలుసు. కథ వినగానే నిర్మించాలనుకున్నా’’ అని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement