ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. బర్త్‌డే గిఫ్ట్‌ సిద్ధం? | RRR Movie Update: JR NTR Birthday Special Video Promo Ready | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్‌: ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ సిద్ధం!

Published Thu, May 14 2020 11:09 AM | Last Updated on Thu, May 14 2020 11:43 AM

RRR Movie Update: JR NTR Birthday Special Video Promo Ready - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఇటీవల రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చరణ్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఎంత వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఏదైనా స్పెషల్‌ గిఫ్ట్‌ను యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అది సాధ్యం అవుతుందా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. 

అయితే టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ వీడియో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్టీఆర్‌ బర్త్‌డే కానుకగా సిద్దం చేసిన వీడియో పట్ల జక్కన్న సంతృప్తి వ్యక్తం చేయడంతో విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇక ఎన్టీఆర్‌ అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ స్పెషల్‌ వీడియో ఉంటుందని లీకువీరులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగతమందిస్తున్నారు.  

చదవండి:
బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌..!
అదే తేదీకి అవతార్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement