రుద్రమదేవి విడుదల తేదీ ఖరారు | Rudrama devi slated to release on 26th june | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి విడుదల తేదీ ఖరారు

Published Thu, Jun 4 2015 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

రుద్రమదేవి విడుదల తేదీ ఖరారు

రుద్రమదేవి విడుదల తేదీ ఖరారు

అనుష్క టైటిల్ రోల్లో నటించిన 'రుద్రమదేవి' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుగుతోందని, ఇటీవలే రీరికార్డింగ్ పూర్తయిందని చెప్పారు. ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజుల పాటు లండన్లో రీరికార్డింగ్ జరిగిందన్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో జూన్ 26వ తేదీనే సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, ఇంకా ప్రధాన పాత్రల్లో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement