ట్యాక్సీవాలా లవ్‌స్టోరీ! | Sai Dharam Tej Spoke About Supreme | Sakshi
Sakshi News home page

ట్యాక్సీవాలా లవ్‌స్టోరీ!

Published Sat, Apr 23 2016 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

ట్యాక్సీవాలా లవ్‌స్టోరీ!

ట్యాక్సీవాలా లవ్‌స్టోరీ!

అతనో టాక్సీ డ్రైవర్. ఆ ట్యాక్సీకో పేరు కూడా ఉందండోయ్! పేరు సుప్రీమ్. అతనికి తిక్క అన్‌లిమిటెడ్. తనకు ఎదురొస్తే ఎవరినైనా రఫ్ఫాడించేస్తాడు. ఇతగాడికో లవ్‌స్టోరీ కూడా ఉంది. ఏకంగా పోలీస్‌నే లవ్‌లో పడేస్తాడు. ఇదే టైంలో ఓ సమస్య. ఇంకేముంది?  తన స్టయిల్లో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైందో సినిమాలోనే చూడాలంటున్నారు చిత్ర నిర్మాతలు.
 
  సాయిధరమ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సుప్రీమ్’ మే మొదటి వారంలో విడుదల కానుంది. ‘‘ఇది అందర్నీ అలరించే ఓ మాస్ ఎంటర్‌టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు.  ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్,  రచనా సహకారం: సాయికృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement