సహజీవనానికి వ్యతిరేకిని కాను : సాయి పల్లవి | Sai Pallavi Comments on Living Together Relationship | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 9:12 AM | Last Updated on Sun, Dec 30 2018 9:12 AM

Sai Pallavi Comments on Living Together Relationship - Sakshi

పెళ్లి కాకుండా స్త్రీ పురుషులు సహజీవనం చేయడానికి తాను వ్యతిరేకిని కాదని నటి సాయిపల్లవి పేర్కొంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం మారి–2, తెలుగు చిత్రం పడి పడిలేచే మనసు ఇటీవల ఒకే రోజు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం సూర్యతో జత కట్టిన ఎన్‌జీకే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాయిపల్లవి మలయాళంలోనూ ఫాహత్‌ ఫాజిల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. అయితే చిత్రాలను ఆచితూచి అంగీకరిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రానాతో మరో చిత్రంలో నటిస్తోంది.

ఇటీవల మారి–2 చిత్ర ప్రమోషన్‌ కోసం చెన్నైకి వచ్చిన సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లీవింగ్‌ టుగెదర్‌ సంబంధం సాగిస్తున్నారా? లాంటి ప్రశ్నలు చాలా మంది వేస్తున్నారని అంది. అయితే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు పుస్తకాలను, సినీరంగంలోకి వచ్చిన తరువాత నటనను ప్రేమిస్తున్నానని చెప్పింది.

వ్యక్తిగతంగా తనకు లీవింగ్‌ టుగెదర్‌ సంబంధాలు అవసరం లేదని పేర్కొంది. అయితే ఇలా చెబుతున్నందున అలాంటి సంబంధానికి తాను వ్యతిరేకినని చెప్పడం కాదని అంది. లీవింగ్‌ టుగెదర్‌ సంబంధం అనేది వారివారి వ్యక్తిగతానికి సంబంధించిన విషయం అని పేర్కొంది. తాను మాత్రం వివాహ జీవితాన్నే కోరుకుంటున్నానని సాయిపల్లవి స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement