
సాయిపల్లవి
ఇన్నాళ్లకు హీరో నాగశౌర్య తన గురించి చేసిన కామెంట్స్‌పై పెదవి విప్పారు కథానాయిక సాయిపల్లవి. ‘‘నేను యాక్ట్ చేసిన కో–స్టార్స్ అందరిలో కల్లా సాయిపల్లవి డిఫరెంట్. ఆమె లొకేషన్‌కు టైమ్‌కి రారు. క్రమశిక్షణ లేదు. షూటింగ్ స్పాట్‌లో ఇబ్బంది పడ్డాం. ‘ఫిదా’ సక్సెస్ ఓన్లీ సాయిపల్లవిదే కాదు. టీమ్ అందరిది’’ అని సాయిపల్లవిని ఉద్దేశిస్తూ ఓ సందర్భంలో హీరో నాగశౌర్య కామెంట్ చేసినట్లుగా ప్రచారమవుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ్ చిత్రం ‘కరు’. తెలుగులో ‘కణం’ పేరుతో విడుదల కానుంది. కాగా నాగశౌర్య కామెంట్స్‌పై సాయిపల్లవిని ప్రశ్నిస్తే ఆమె ఈ విధంగా స్పందించారట. ‘‘సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది.
ఇతరుల మనోభావాలను నేను గౌరవిస్తాను. నా వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే నాకు బాధగా ఉంటుంది. నాగశౌర్యకి నాతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలియదు. నా గురించి అతను మాట్లాడిన మాటలు విని, బాధపడ్డాను. డైరెక్టర్ విజయ్‌గారికి ఫోన్ చేసి ‘నా ప్రవర్తన వల్ల షూటింగ్ స్పాట్‌లో ఎవరికైనా ఇబ్బంది కలిగిందా?’ అనడిగాను. ఆయన లేదన్నారు. ఎవరైనా నాపై కంప్లైట్ చేశారా? అని కూడా అడిగాను. ‘నో’ అన్నారు. ఈ విషయం గురించి నాగశౌర్య కూడా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. నా అదృష్టం కొద్దీ ఈ విషయాన్ని నాగశౌర్య దాచలేదు. ఓపెన్‌గా కామెంట్ చేశారు. మంచిదే’’ అని సాయిపల్లవి అన్నారని ప్రచారం జరుగుతోంది.