అమ్మ అంత మాట ఎందుకు అన్నట్లు..? | Saif Ali Khan Worried About Her Mother Health in Delhi | Sakshi

బెంగ పెట్టుకున్నాడు

Apr 9 2020 10:30 AM | Updated on Apr 9 2020 10:30 AM

Saif Ali Khan Worried About Her Mother Health in Delhi - Sakshi

తల్లీకొడుకులు : సైఫ్, షర్మిల

అమ్మకు దూరంగా ఉన్నవారందరికీ ఇప్పుడీ లాక్‌డౌన్‌ కాలంలో అమ్మ గుర్తుకు వస్తోంది! మామూలు రోజుల్లో అమ్మకు ఫోన్‌ చెయ్యడానికి కూడా తీరికలేనంతగా బిజీగా ఉండే పుత్రరత్నాలు ‘అమ్మా.. ఎలా ఉన్నావ్‌?’ అని ఫోన్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కూడా చాలా కాలం తర్వాత మొన్న శనివారం షర్మిలమ్మకు ఫోన్‌ చేశాడు. ‘‘అమ్మా.. బాగున్నావా?’’అని అడిగాడు. పెద్ద కూతురు సబాతో కలిసి ఆవిడ ఢిల్లీలో ఉంటున్నారు. సబా.. సయీఫ్‌కి పెద్ద చెల్లి. సోహా చిన్న చెల్లి. వీళ్లిద్దరూ (సైఫ్, సోహా) ముంబైలో ఉంటున్నారు. ‘‘అమ్మా.. బాగున్నావా?’’అని సైఫ్‌ అడగ్గానే.. ‘‘బాగున్నాను నాయనా’’ అన్నారు షర్మిల. అక్కడితో ఆగకుండా.. ‘‘పూర్తి జీవితం జీవించాను. పశ్చాత్తాపాలు కూడా ఏమీ లేవు’’ అన్నారు నవ్వుతూ. ఇక అప్పట్నుంచీ సైఫ్‌కి బెంగ పట్టుకుందట! అమ్మ నవ్వుతూ అనినా, అంత మాట ఎందుకు అన్నట్లు అని డీప్‌ థింకింగ్‌లోకి వెళ్లిపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement