
శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్
‘ఔజార్, గర్వ్, ఫిర్ మిలేంగే’ వంటి చిత్రాల్లో నటించి మంచి జోడీ అనిపించుకున్నారు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి. ఇప్పుడు మరోసారి జోడీగా కనిపించబోతున్నారని టాక్. వీళ్లిద్దరూ ఫస్ట్ టైమ్ కలసి యాక్ట్ చేసిన ‘ఔజార్’కు సీక్వెల్‌లో మళ్లీ జతకట్టే అవకాశం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 2006లో వచ్చిన ‘షాదీ కర్కే ఫస్ గయా యార్’ ఈ జంట చివరి చిత్రం. జతగా కనిపించిన 12 ఏళ్లయింది. మరి.. మళ్లీ కనిపిస్తారా? కాలమే సమాధానం చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment