
సల్మాన్ ఖాన్, జహీర్ ఇక్బాల్
గౌరవం.. విధేయత... ఈ రెండు విషయాల్ని అస్సలు మర్చిపోవద్దని నయా హీరో జహీర్‌కు సూచనలిస్తున్నారు సల్మాన్ ఖాన్. సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా జహీర్ ఇక్బాల్ అనే కొత్త కుర్రాణ్ని బాలీవుడ్‌కి పరిచయం చేయనున్నారు సల్మాన్ ఖాన్. ఎవరీ జహీర్ ఇక్బాల్ అంటే సల్మాన్ ఖాన్ చిన్ననాటి స్నేహితుడు ఇక్బాల్ తనయుడు. జహీర్ లాంచ్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇక్బాల్ నా చిన్ననాటి దోస్త్.
టీనేజ్‌లో అతనే నా బ్యాంక్. అతనికింకా నేను 2011 రూపాయిలు బాకీ. దేవుడి దయ వల్ల వడ్డీ తీసుకోలేదు. అబ్బాయిని లాంచ్ చేస్తున్నాను కదా. అలాగే ఇక్బాల్ ఎప్పుడూ నీ బెస్ట్ ఇవ్వు. ఏం జరిగినా సరే’’ అని పేర్కొన్నారు సల్మాన్. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ లవ్ స్టొరీని ‘ఫిల్మిస్థాన్’ ఫేమ్ నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మురాద్ కెటానీ, అశ్వినీ వార్దే సినీ స్టూడియోస్ నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment