హైయ్యస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్ సల్మాన్
హైయ్యస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్ సల్మాన్
Published Thu, Mar 23 2017 11:51 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
ముంబై : బాలీవుడ్ హీరోలు తెర మీదే కాదు తెర వెనక కూడా రికార్డ్లు సృష్టిస్తున్నారు. ప్రతీ ఏడాది తన సంపాదనను డబుల్ చేసుకుంటూ పోతున్న స్టార్స్, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలోనూ రికార్డ్లు సృష్టిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ అత్యధిక అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన నటుడిగా రికార్డ్ సృష్టించాడు. గత ఏడాది 32 కోట్ల ట్యాక్స్ చెల్లించిన సల్మాన్ ఈ ఏడాది మరింత భారీగా 44.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ ను ప్రభుత్వానికి కట్టాడు.
సల్మాన్ తరువాతి స్థానం రూ.29.5 కోట్లతో అక్షయ్ కుమార్, 25.5 కోట్లతో హృతిక్ రోషన్ లు ఉన్నారు. ఇక గత ఏడాది దంగల్ సినిమాతో సంచలన విజయం నమోదు చేసిన అమీర్ మాత్రం రూ.14.5 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తెలిసింది. అమీర్ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ కామెడీ స్టార్ కపిల్ శర్మ కట్టిన దానికన్నా తక్కువ కావటం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. కొంత మంది అందాల భామలు కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు.
బాలీవుడ్ తో పాటు హలీవుడ్ లోనూ దూసుకుపోతున్న దీపికా పదుకొణే రూ.10.25 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించగా.. అలియాభట్ రూ.4.33 కోట్లు, కరీనా కపూర్ రూ.3.9 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ గా చెల్లించారు.
Advertisement
Advertisement