దీపికాను చూసి షాకైన భాయిజాన్‌! | Salman Khan Looking Amazed After Seen Deepika Padukone long Train Gown | Sakshi

దీపికాను చూసి షాకైన భాయిజాన్‌!

Sep 24 2019 3:21 PM | Updated on Sep 24 2019 3:35 PM

Salman Khan Looking Amazed After Seen Deepika Padukone long Train Gown - Sakshi

అవార్డు ఫంక‌్షన్స్‌ అనగానే మన సెలబ్రిటీలంతా అందరికంటే భిన్నంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా మన హీరోయిన్స్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న వస్త్రధారణతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైపోతారు. ఇటీవల జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ స్టన్నింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ‘ఫిగర్‌ హగ్గింగ్‌ ఫ్రాక్‌’లో ఈ బ్యూటీక్వీన్‌ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గౌరవ్‌ గుప్త డిజైన్‌ చేసిన ఫ్రాక్‌కి ఫెదర్స్‌తో అలంకరించిన లాంగ్‌ ట్రైన్‌ డ్రేప్‌ను దీపిక తలపై నుంచి ధరించారు. ఇక దీపిక వేసుకున్న ఫ్రాక్‌ను చూసి అందరు ఆమె నుంచి చూపును తిప్పుకోలేకపోయారు. చివరికి మన బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సైతం తన ఫ్రాక్‌కి ఫిదా అయ్యారేమో అనిపిస్తుంది ఈ వీడియో  చూస్తుంటే. అవార్డు ఫంక్షన్‌కు వచ్చిన దీపికా మీడియాతో మాట్లాడుతుండగా తన వెనక నుంచి.. సల్మాన్‌ ఖాన్‌ వెళ్తూ.. దీపిక ఫెదర్‌ లాంగ్‌ ట్రైన్‌ డ్రాప్‌ను చూసి ఆశ్చర్యపోయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో భాయిజాన్‌ దీపిక ఫ్రాక్‌ను చూసి ఆశ్చర్యపోతూ.. దీపికా లాంగ్‌ ట్రైన్‌ డ్రాప్‌ను చూసుకుంటూ అది చూడండి ఎంత పెద్దగా ఉందో అన్నట్లుగా పాయింట్‌ అవుట్‌ చేస్తూ సల్మాన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి అక్కడి వారంతా సరదాగా నవ్వుకున్నారు.  అవార్డు షోలో  తన లాంగ్‌ ట్రైన్‌  డ్రాప్‌ను క్యారీ చేయలేక అవస్థ పడుతున్న దీపికాను చూసి తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ తన ఫెదర్‌ ట్రైన్‌ను పట్టుకుని  వెనకాల వెళ్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ హల్‌ చల్‌ చేస్తోంది. కాగా దీపికా ఐఫా- 20 ఏళ్ల కాలానికి గానూ ఉత్తమ నటి కేటగిరీలో అవార్డు అందుకున్నారు. అలాగే పద్మావత్‌లో సుల్తాన్‌ అల్లాఉద్దీన్‌ ఖిల్జీ పాత్ర పోషించిన దీపిక భర్త రణ్‌వీర్‌ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement