
ముంబై: బాలీవుడ్ సుపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల తన పొలంలో ఒళ్లంతా మట్టితో ఉన్న ఫొటోను షేర్ చేసి విమర్శల పాలయ్యారు. అయినప్పటికీ తాజాగా భాయిజాన్ మరో కొత్త వీడియోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వర్షంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ.. బురదలో నడుస్తున్న వీడియోకు సల్మాన్ ‘వ్యవసాయం’ అనే క్యాప్షన్‌ను జత చేసి షేర్ చేశాడు. (చదవండి: ‘ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు సల్మాన్’)
ఇక ఇది చూసిన నెటిజన్లు భాయిజాన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ఇదంతా నాటకం. మీరు బాగా నటిస్తారు. అది వ్యవసాయం కాదు ఆడుకోవడం అంటారు’, ‘మీరు ఇలా షో ఆఫ్ చేసే బదులు రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై పోస్టు చేయొచ్చు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే’, ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment