మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్ | Salman Khan sports handlebar moustache for 'Sultan' | Sakshi
Sakshi News home page

మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్

Published Fri, Oct 9 2015 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్

మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్

‘‘రెజ్లింగ్ అంటే ఆట మాత్రమే కాదు... అది మనలో  నిరంతరం జరిగే యుద్ధం’’ అని సల్మాన్ ఖాన్ అంటున్నారు. ఇంతకీ రెజ్లింగ్ గురించి ఈ కండల వీరుడు ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ప్రస్తుతం నటిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ మల్లయోధునిగా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌పై పైన చెప్పిన వాక్యాలు ఉన్నాయి. మంచి ఫిజిక్ ఉన్న సల్మాన్ మల్లయోధుడిగా ఎలా ఉంటారో చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దానికి తోడు సల్మాన్ మల్లవిద్యలో శిక్షణ తీసుకుంటున్నట్టు బయటకు వచ్చిన ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం సినిమా మీద ఇంకా అంచనాలు పెంచేసింది. ఇక, శుక్రవారం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి, సల్మాన్ అభిమానులు సూపర్ అంటున్నారు. పెరిగిన గెడ్డం, మెలి తిిప్పిన మీసాలతో సల్మాన్ అదిరిపోయాడని సోషల్ మీడియాలో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. సల్మాన్‌ఖాన్‌కు బాగా అచ్చొచ్చిన రంజాన్ సందర్భంగా వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement