సుభాష్ ఘై డెరైక్షన్‌లో...
సుభాష్ ఘై డెరైక్షన్‌లో...
Published Mon, Oct 28 2013 11:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఇటీవలి కాలంలో వరుస సంచలన విజయాలతో బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సల్మాన్ ఖాన్. గతంలో బాలీవుడ్‌కి రికార్డు స్థాయిలో హిట్స్ అందించారు షోమేన్ సుభాష్ ఘై. ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి బాలీవుడ్ నివ్వెరపోయే విధంగా ‘యువరాజ్’ అనే ఓ ఘోర పరాజయ చిత్రాన్ని అందించారు. అప్పటినుంచీ వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ బాలీవుడ్ తెరపై కనిపించలేదు. కొద్దికాలంగా సుభాష్ ఘై బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ తన మార్క్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సల్మాన్ ఖాన్‌తో పని చేయబోతున్నారు. ‘‘మేమిద్దరం ఓ చిత్రం చేయాలని కమిట్ అయ్యాం. సల్మాన్ వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.
త్వరలోనే మేమిద్దరం కలిసి.. ఈ ప్రాజెక్ట్‌కు ఓ రూపం ఇవ్వనున్నాం. నా తదుపరి చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తోనే రూపొందించనున్నాను’’ అని సుభాష్ ఘై తెలిపారు. ఇదిలా ఉండగా - 1983లో సుభాష్ ఘై దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హీరో’ని రీమేక్ చేసుకోవాలని సల్మాన్ ముచ్చటపడుతున్నారు. సల్మాన్ అడిగిన వెంటనే సుభాష్ ఘై హక్కులు ఇచ్చేశారు. జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి నటించిన ‘హీరో’ చిత్రం రీమేక్‌లో ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్, సునీల్ శెట్టి కూతురు అతియాలు నటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement