డైరెక్టర్కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్ | Salman memorable gift to Kabir Khan | Sakshi
Sakshi News home page

డైరెక్టర్కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్

Aug 31 2015 10:41 AM | Updated on Sep 3 2017 8:29 AM

డైరెక్టర్కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్

డైరెక్టర్కు గిప్ట్ ఇచ్చిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చే గిప్ట్లంటే యమ క్రేజీ. తను ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగల విశాలమైన మనసు కలవాడనే పేరు సల్లూభాయ్కి ఉంది. కెరీర్లో....

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చే గిప్ట్లంటే యమ క్రేజీ. తను ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయగల విశాలమైన మనసు కలవాడనే పేరు సల్లూభాయ్కి ఉంది. కెరీర్లో జెట్ స్పీడ్లో దూసుకు పోతున్న సల్మాన్  తన విజయాలకు సహకరించిన వారికి మెమరబుల్ బహుమతులు ఇవ్వడం మనకు తెలిసిందే. తాజాగా సల్మాన్ హీరోగా విడుదలైన 'బజరంగీ బాయ్జాన్'  ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్కు... మరిచిపోలేని గిప్ట్ ఇచ్చాడు.

తానే స్వయంగా వేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ పొట్రాయిట్ను కబీర్కు ప్రెజెంట్ చేశాడు. అంతేకాదు ఈ పొట్రాయిట్కు బజరంగీ బాయ్ జాన్ అని పేరు పెట్టాడు. కండలవీరుడు ఇచ్చిన గిప్ట్తో పొంగిపోయిన కబీర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సల్మాన్ ప్రజెంట్ చేసిన పెయింటింగ్ను షేర్ చేస్తూ తన లైఫ్లో ఇదే బెస్ట్ గిప్ట్ అంటూ కామెంట్ చేశాడు.

గతంలో 'ఏక్ థా టైగర్' సినిమా కోసం కలిసి పనిచేసిన సల్మాన్, కబీర్లు బజరంగీ బాయ్జాన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాశారు. ఈ మూవీ తరువాత కబీర్ డైరెక్ట్ చేసిన ఫాంటమ్ కూడా మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో సల్మాన్ గిప్ట్ కబీర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement