పెళ్లి వార్తల తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత తిరిగి బిజీ అవుతుంది. ఇప్పటికే రాజుగారి గది 2 తో పాటు రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు మరికొన్ని తమిళ, తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పల్లెటూరి పెద్దమనిషిలా సమంత పంచె కట్టు, షర్టు తో కనిపిస్తున్న ఈ స్టిల్.. రామ్ చరణ్ సినిమాలోది అన్న టాక్ వినిపిస్తోంది. చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఫోటోలో రావూ రమేష్ కూడా ఉండటంతో ఈ సినిమాలో సమంత సరదాగా తండ్రి ఆటపట్టించే సీన్కు సంబంధించిన స్టిల్ అని భావిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా.. సమంత లుక్కు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.
సోగ్గాడి లుక్లో సమంత
Published Wed, May 3 2017 3:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
Advertisement
Advertisement