సాక్షి, హైదరాబాద్: సమంత- నాగచైతన్యల ఫ్యాన్స్‌కు అక్టోబర్‌లో మరో దసరా పండుగ రానుంది. ఇటు కాబోయే పెళ్లికూతురు, టాలీవుడ్ హీరోయిన్ సమంత నెట్టింట్లో అప్పుడు మ్యారేజ్ హడావుడి మొదలైంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్‌లో తనదైన దుస్తులతో అందరినీ అలరించిన ఆమె తాజాగా పెళ్లి సందర్భంగా ధరించే వస్త్రాల గురించి ప్రస్తావించారు. ద స్టోరీ బిగిన్స్ అంటూ అందంగా ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే అభిమానుల సందడి మొదలైంది.
‘నైపుణ్యం, అందమైన హృదయం ఉన్న నా డాల్, స్నేహితురాలు క్రేశా బజాజ్. ఆమె లవ్‌స్టోరీ లెహంగాలు అద్భుతంగా ఉంటాయంటూ డిజైనర్ క్రేషా బజాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయంలో నేనెవరినైనా నమ్మితే ఆమెనే అంటూ బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. అంతేకాదు ఇది మ్యారేజ్‌లో ధరించబోయే లెహంగా అవుతుందేమో అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేశారు. అభిమానుల్ని ఈ ఫొటోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెకి పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.
అది కాగా సమంత- చైతూల పెళ్లి వచ్చేనెల ఆరున గోవాలో జరగనుంది. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిశ్చితార్థం రోజున సమంత కట్టుకున్న చీరని కూడా క్రేషా బజాజ్ రూపొందించిన సంగతి తెలిసిందే! దీంతో పెళ్లిలో తమ అభిమాన హీరోయిన్ కట్టుకోబోయే చీరపై ఇప్పటికూ పలు అంచనాలు హల్ చల్ చేస్తుండగా, సమంత తాజా ఫోటోలు ఆసక్తికరంగా మారాయి.