
‘మిస్టర్ పెళ్లాం’, ‘శ్రీకారం’ వంటి హిట్ సినిమాలు నిర్మించిన గవర పార్థసారధి చాలా విరామం తర్వాత రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఒకటి, సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా రూపొందిస్తున్నారు.
పార్థసారధి మాట్లాడుతూ– ‘‘‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అడివి సాయికిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నిర్మిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభిస్తాం. తొలిచిత్రం ‘ఘాజీ’తో జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ యువ హీరో నటిస్తారు’’ అన్నారు.