సెల్ఫ్‌ క్వారంటైన్‌లో సీనియర్‌ నటి | Shabana Azmi under self quarantine  | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ క్వారంటైన్‌లో సీనియర్‌ నటి

Published Fri, Mar 20 2020 3:40 PM | Last Updated on Fri, Mar 20 2020 3:43 PM

Shabana Azmi under self quarantine  - Sakshi

షబానా అజ్మీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్‌నుంచి తిరిగి వచ్చిన ఆమె దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్‌) విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర‍్యగా  సెల్ఫ్‌ క్వారంటైన్‌గా ఉన్నట్టు తెలిపారు. మార్చి 15 ఉదయం బుడాపెస్ట్ నుండి తిరిగి వచ్చాను. మార్చి 30 వరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో వుండాలని నిర్ణయించుకున్నానంటూ షబానా ట్విటర్‌లో  ప్రకటించారు. 

కరోనా వైరస్ భయంతో ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు అనేక  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.  సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు స్వీయ  నియంత్రణ పాటిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ ప్రయాణ వివరాలను గోప్యంగా ఉంచుతూ ప్రమాద తీవ్రతను  పెంచుతున్న సంగతి  తెలిసిందే.  కాగా  కరోనా మహమ్మారికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10వేల  మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,   2.5 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement