'అతడే నా బెస్ట్ కో-స్టార్' | Shah Rukh is best co-star I have ever worked with: Alia Bhatt | Sakshi
Sakshi News home page

'అతడే నా బెస్ట్ కో-స్టార్'

Published Fri, Mar 11 2016 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

'అతడే నా బెస్ట్ కో-స్టార్'

'అతడే నా బెస్ట్ కో-స్టార్'

ముంబై: బాలీవుడ్ బాద్ షాను యువ హీరోయిన్ అలియా భట్ పొగడ్తల్లో ముంచెత్తింది. తనతో పాటు నటించిన హీరోల్లో షారూఖ్ ఖాన్‌ బెస్ట్ కో-స్టార్ అంటూ పొడిగేసింది. గౌరీ షిండే తెరకెక్కిస్తున్న సినిమా షారూఖ్ సరసన అలియా నటిస్తోంది. 'షారూఖ్ తో నేను నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. నేను చాలా నెర్వస్ గా ఫీలయ్యా.. డైలాగులు మర్చిపోకూడదని బాగా రిహార్సల్ చేశాం. నేను నటించిన హీరోల్లో షారూఖే బెస్ట్ కో-స్టార్' అని అలియా పేర్కొంది.

నటన పట్ల ఆయనకు అంకితభావం మెండుగా ఉందని కితాబిచ్చింది. షారూఖ్, అలియా సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. కాగా, తాజా చిత్రం 'కపూర్ అండ్ సన్స్' ప్రమోషన్ లో అలియా బిజీగా ఉంది. ఇందులో తన పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పింది. ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement