'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది' | Shah Rukh wants to be Saina Nehwal of films! | Sakshi
Sakshi News home page

'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది'

Published Mon, Oct 5 2015 3:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది'

'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది'

ముంబై: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, బాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్  పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకుంటూ మురిసిపోతున్నారు.  బాడ్మింటన్ లో తాను షారూఖ్ ఖాన్ అంతటి దాన్ని కావాలని సైనా కోరుకుంటే, తాను సినిమాల్లో సైనా నెహ్వాల్ లా దూసుకెళ్లాలని అనుకుంటున్నట్టు 'కింగ్ ఖాన్'  ట్వీట్ చేశాడు.

కాగా దిల్ వాలే షూటింగ్ నిమిత్తం  హైదరాబాదకు వచ్చిన  షారూఖ్ ఖాన్ ను కలవాలనుకుంటున్నట్టు బ్యాడ్మింటన్ స్టార్ సైనా చెప్పడంతో.. షారూఖ్ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి మరీ హయత్ నగర్ లోని షూటింగ్ స్పాట్ కు రమ్మని ఆహ్వానించాడు.  దాదాపు 2 గంటలపాటు ఈ స్టార్లు ఇద్దరూ సెల్ఫీలతో సందడి చేసారు.  షారూఖ్ కు బ్యాడ్మింటన్ రాకెట్ ను గిఫ్ట్ గా ఇచ్చింది సైనా.  ఆ సెల్ఫీలను  ట్విట్టర్లో పోస్ట్ చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement