మహిళలపై ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్ ఆవేదన | Saina Nehwal Tweet About Anti Woman Remarks By Congress Leader, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

మహిళలపై ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్ ఆవేదన

Published Sat, Mar 30 2024 3:58 PM | Last Updated on Sat, Mar 30 2024 7:08 PM

Saina Nehwal Tweet About Anti Woman Remarks By Congress Leader - Sakshi

బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలపైన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించింది.

స్త్రీలను వంటగదికే పరిమితం చేయాలి అనే వ్యాఖ్యలకు కలత చెందిన సైనా నెహ్వాల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు బాధాకరం. ఆడపిల్లలు అన్నిరంగాల్లో దూసుకెళ్లాలని కలలు కంటున్నప్పుడు ఇలా అనడం సమంజసం కాదు. ఒకవైపుకు మహిళామణులను ఒక శక్తిగా భావిస్తున్నారు. మోదీ సర్కార్ మహిళల కోసం అనేక రిజర్వేషన్ బిల్లులు తీసుకువస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదని అన్నారు.

దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా శివశంకరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.

గాయత్రి సిద్దేశ్వరను ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. ఆమెకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement