శ్రీమతి శ్రియ | Shriya Saran-Andrei Koscheev's wedding photos | Sakshi
Sakshi News home page

శ్రీమతి శ్రియ

Published Wed, Mar 21 2018 1:04 AM | Last Updated on Wed, Mar 21 2018 1:04 AM

Shriya Saran-Andrei Koscheev's wedding photos  - Sakshi

శ్రీమతిగా  శ్రియ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో ఆమె వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. సోమవారం ఉదయపూర్‌లో ఆండ్రీ, శ్రియ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైపోయారు. అయితే ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్‌ అయ్యాయి. 

అంతేకాదు శ్రియ వెడ్డింగ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతోంది. ‘‘ఎవరైతే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారో, వారి ప్రేమ నీలో కొంత మంచి మార్పును కోరుకుంటుంది. ఈ మార్పు ప్రేమ కాకపోవచ్చు. రాజీపడటం. శ్రియ ప్రేమ ప్రతిరోజూ నన్ను కొత్తగా, బెటర్‌గా ఉంచుతుందన్న నమ్మకం ఉంది’’ అని ఆండ్రీ కోశ్చివ్‌ అన్నట్లుగా ఈ వీడియాలో ఉంది. భర్త మాట్లాడుతున్న సమయంలో శ్రియ ప్రేమగా అతన్ని ముద్దాడటం హైలైట్‌. ఇదిలా ఉంటే ఈ జంట ఈ నెల 12న ముంబైలో తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకున్నారని టాక్‌. ఆ ముందు రోజు పార్టీని కూడా బాగానే సెలబ్రేట్‌ చేసుకున్నారట. ఇక.. ఆండ్రీ విషయానికొస్తే... అతను నేషనల్‌ లెవల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌. అంతేకాదు మాస్కోలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్‌కు యజమాని. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన‘నరగాసురన్‌’ (తెలుగులో నరకాసురుడు) రిలీజ్‌కు రెడీ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement