
సాక్షి, సినిమా: విశ్వనటుడు కమలహాసన్ ఒక పక్క సినిమాలతో, మరో పక్క మక్కళ్ నీది మయ్యం పార్టీ కార్యక్రమాలతోనూ, ఇంకో పక్క బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోతోనూ యమ బిజీగా ఉన్నారు. తదుపరి తాను నటిస్తున్న శభాష్ నాయడును పూర్తి చేయడానికి, ఇండియన్ 2 చిత్రంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాగే స్వామి కార్యం, సొంత కార్యం అన్న సామెత మాదిరి బిగ్‌బాస్ గేమ్ షోను తన రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఆదివారం బిగ్‌బాస్ గేమ్ షోలో తన విశ్వరూపం 2 చిత్ర ఆడియోను విడుదల చేసి విశేష ప్రచారం పొందే ప్రయత్నం చేశారు.
ఈ బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి మీరు రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తూ సినిమాలకు దూరం కావద్దు అని కోరాడు. కమల్ స్పందిస్తూ సినిమాను వదిలి పోలేను. అయినా నటిస్తేనే సినిమాల్లో ఉన్నట్టా? మీతో పాటు కూర్చుని సినిమాలు చూస్తూనే ఉంటాను. ముందు తరం వారు నాకు అదే నేర్పించారు. ఇది త్యాగం కాదు. ఉత్తమ విలన్ చిత్రంలో నా సీటులో కూర్చో అన్న సంభాషణలను దర్శకుడు బాలచందర్‌నే రాశారు. అందుకే మళ్లీ మళ్లీ నటించాలంటూ నన్ను సంకటంలో పడేయకండి అని బదులిచ్చారు.
శ్రుతి సందడి..
బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి శ్రుతీహసన్ ప్రవేశించి సందడి చేశారు. ఈ బ్యూటీ ఒక్కటే పాల్గొంటే పెద్దగా చెప్పుకోవలసిన పని లేదు. ప్రియుడు మైఖేల్‌తో కలిసి రావడం హౌస్‌లోని వారికి, ఆడియన్స్‌కు ఉత్సాహాన్నిచ్చిన అంశం. విశ్వరూపం చిత్రంలోని ఒక పాటను శ్రుతీహాసన్ పాడి, ఆడటాన్ని ఎదురుగా కూర్చున ప్రియుడు ఆనందంగా తిలకించారు. మరో విషయం ఏమిటంటే శ్రుతీహాసన్ తన ప్రియుడితో తెగదెంపులు చేసుకున్నారని, ఇకపై సినిమాలపైనే పూర్తిగా దృష్టిసారించనున్నారనీ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. దానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికే శ్రుతి బిగ్‌బాస్‌లో ప్రియుడితో కలిపి పాల్గొన్నారనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment