
'ఐ లవ్ యూ మమ్మీ..'
ప్రముఖ సినీనటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ సినీనటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అభిమానులు ట్విట్టర్ ద్వారా రేణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నింటికన్నా మిన్నగా పవన్ వారసులు అకిరా, ఆద్యలు అమ్మ పుట్టినరోజును తమ స్టైల్లో సెలబ్రేట్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే మామ్' అంటూ అమ్మ చేత ఓ కలర్ఫుల్ కేక్ కట్ చేయించారు.
అకిరా అయితే అమ్మ మీదున్న ప్రేమనంతా తన చిట్టి చిట్టి రాతలతో పేపర్ మీద పెట్టేశాడు. ఆ లెటర్ చదివిన రేణు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన సంతోషాన్నంతా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తనకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రేణు దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా పవన్ కల్యాణ్, రేణులు విడిపోయిన తర్వాత.. ప్రస్తుతం చిన్నారులు అకిరా నందన్, ఆద్యలు పూణెలో తల్లి వద్దే ఉంటున్నారు.
And can it get any better than this? 🎉🎉🎉🎉 pic.twitter.com/ZkLRCZUCag
— renu (@renuudesai) December 3, 2015
And some words render me speechless...Akira has gifted me the most beautiful and perfect words for my bday ❤️ pic.twitter.com/1KXSqId89D
— renu (@renuudesai) December 4, 2015